‘దేవర’ షూటింగ్ లో ప్రమాదం

దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడుగా, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాహ్ణవి కపూర్ కథానాయకిగా మన ముందుకు రాబోతున్న చిత్రం దేవర. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాకున్నది. ఇటీవలే ఈ సినిమా నుండి వచ్చిన గ్లిమ్ప్స్ కు మంచి స్పందన వచ్చింది. ఎన్టీఆర్ డైలాగ్ ఇంకా ఎలేవేషన్ ప్రేక్షకులను బాగా మెప్పించాయి.

అయితే సోమవారం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఒక తేనెటీగల పుట్ట ప్రమాదవశాత్తూ చెదిరిపోయింది. ఇక 20 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులపై తేనెటీగలు దాడికి దారితీసింది. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అధికారిక పిఆర్ ప్రకారం ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. మరికొందరికి సాధారణ తేనెటీగ కాటు వచ్చింది & పెద్దగా ఏమీ లేదు. ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులలో ఆందోళన కలిగించినప్పటికీ, చిత్ర యూనిట్ షూటింగ్ లొకేషన్ నుండి అప్‌డేట్‌లను పంచుకోవడంలో జాగ్రత్తగా ఉంది.