‘ఆర్య’ కు 20 సంవత్సరాలు

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సుకుమార్ దర్శకులుగా ఆరంగేట్రం చేసిన సినిమా ఆర్య. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా 20 సంవత్సరాల క్రితం మే 7న 2004 ఈ చిత్రం విడుదల అయింది. అయితే అప్పట్లో ఈ సినిమా తెలుగు సీనియా ఇండస్ట్రీ లోనే కాకుబ్ద జాతీయ స్థాయిలో మంచి విజయం సాధించింది.

వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ ను సృష్టించింది. అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ ను తార స్థాయిలో నిలబెట్టింది ఈ సినిమా. ఆ తరువాత అదే తరహాలో ఆర్య 2 వచ్చిన విషయం అందరికి తెలిసినదే. అటు సినిమా పరంగానే కాకుండా ఇటు మ్యూజిక్ పరంగా కూడా మాంచి హిట్ అందుకుంది.

అయితే దర్శకుడు సుకుమార్ ఆర్య తరువాత మరి కొన్ని సినిమాలతో మంచి విజయాలు సాధించారు. ఆర్య, ఆర్య 2 తరువాత ఆయన అల్లు అర్జున్ తో కలిసి “పుష్ప ది రైజ్” అనే సినిమా తీయగా ఆ సినిమా ప్రపంచ స్థాయి విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా “పుష్ప ది రూల్” రాబోతుంది. ఈ సినిమా ఆగష్టు 15న విడుదల అని మేకర్స్ ఇప్పటికే ప్రకటన ఇచ్చారు.

స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అని పిలువబడేలా చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తరువాత సినిమా అయినా పుష్ప ది రూల్ కోసం తెలుగు సినిమా ప్రేక్షకులే కాకుండా ప్రపంచం అంత వేచి చూస్తున్నారు.