మణిరత్నం పాన్ ఇండియా మూవీలో విలక్షణ నటుడు

డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ పొన్నీయిన్ సెల్వన్ గురించి గత కొద్దికాలంగా జోరుగా చర్చ జరుగుతోంది. భారీ హిస్టారికల్ మూవీగా ఇది తెరకెక్కుతుండగా.. టాప్ టెక్నీషియన్లు ఇందులో పనిచేస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ విలన్ పాత్రలో నటించనుండటంతో.. సినిమాలపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.

prakash raj in manirantam movie

అయితే ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఒక వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ సినిమాలో కార్తీ, చియాన్ విక్రమ్, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయం రవి కీలక పాత్రలలో నటించనున్నారు.