BB3లో సోనూసూద్?

బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో రానున్న BB3పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా మే 28న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ప్రగ్యాజైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.

SONUSOOD IN BB3

అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం సోనూసూద్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. సోనూసూద్ అయితేనే బాగుంటుందని బోయపాటి భావిస్తున్నాడట. అందుకని ఇటీవల సోనూసూద్‌తో బోయపాటి దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్‌కి సంబంధించిన సీన్స్ చెప్పినట్లు సమాచారం. కానీ ఇందులో నటించడానికి రూ.5 కోట్ల వరకు సోనూసూద్ డిమాండ్ చేస్తున్నాడట.