ఎఫ్-3లో షూటింగ్‌లో తమన్నా ఫొటో.. వైరల్

వెంకటేష్-వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా F3. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. F2 సూపర్ హిట్ కావడంపై.. F3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఆగస్టు 27న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

TAMANNA IN F3 SHOOTING

F2కు సీక్వెల్‌గా దీనిని తెరకెక్కిస్తుండగా.. తమన్నా, మెహరీన్‌ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో తమన్నా పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. షూటింగ్ స్పాట్‌లో వెంకటేష్, అనిల్ రావిపూడితో పాటు సినిమాలోని కొంతమంది నటీనటులతో తమన్నా దిగిన ఫొటో వైరల్ అవుతోంది. అయితే త్వరలో వరుణ్ తేజ్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు.