ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభాస్

అభిమానులకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గుడ్‌న్యూస్ చెప్పాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు ప్రభాస్ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఒక పోస్టర్‌ను ప్రభాస్ విడుదల చేశాడు. ఈ పోస్టర్‌లో ఆదిపురుష్ ఆరంభ్ అని ఉంది. ఇటీవల కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమా షూటింగ్ ప్రభాస్ పాల్గొన్నాడు. రామగుండంలోని బొగ్గుగనిలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

adipurush shooting start

దీంతో పాటు ప్రభాస్ ఆదిపురుష్ షూటింగ్‌లో కూడా పాల్గొననున్నాడు. ఇవాళ ముంబైలో ఆదిపురుష్ రెగ్యూలర్ షూటింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా… రావణుడి పాత్రలో సూఫ్ అలీ ఖాన్ నటించనున్నాడు.