ఇదెక్కడి ట్రైలర్ వర్మ మావా…

రామ్ గోపాల్ వర్మ… ది క్రియేటివ్ సెన్సేషన్ ఇన్ ఇండియన్ సినిమా. షాట్ మేకింగ్ నుంచి బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ వరకూ వర్మ సినిమాలో అన్నీ కొత్తగా ఉంటాయి. ఎప్పుడూ ఎదో ఒక ప్రయోగం చేస్తూ ఉండే వర్మ, ఇండియాస్ ఫస్ట్ లెస్బియన్ క్రైమ్ డ్రామాని తెరకెక్కించాడు. డేంజరస్ పేరుతో రూపొందిన ఈ సినిమాలో అప్సరా రాణి, నైనా గంగూలీ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఆ కిల్లర్ ఎఫైర్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేశాడు. రొమాంటిక్ థ్రిల్లర్ కి సరైన ఎగ్జాంపుల్ లా ఉన్న ఈ డేంజరస్ ట్రైలర్ చూసిన నెటిజెన్స్ ఇదేమి ట్రైలర్ వర్మ మావ బ్రో అంటూ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ రెండూ ఇస్తున్నారు.

లీడ్ పెయిర్ రొమాన్స్ తో ట్రైలర్ ఓపెన్ చేసిన వర్మ, ఈ క్రైమ్ డ్రామాలో లెస్బియన్లు తమ ప్రేమ కోసం చావడానికైనా.. ఎవరినైనా చంపడానికైనా సిద్ధంగా ఉంటారనే హింట్ ఇచ్చాడు. అప్సరా రాణి నైనా గంగూలి లవ్ స్టోరీ ఏంటి? వాళ్ల దెగ్గరికి అంత డబ్బు ఎలా వచ్చింది? ఎలాంటి క్రైమ్ లో వాళ్లు ఇరుక్కున్నారు అనేది సింపుల్ గా డేంజరస్ కథ. ఈ ట్రైలర్ లో ఇంకో విశేషం ఏంటంటే, వర్మ తాను డైరెక్ట్ చేసిన అంతం సినిమాలోని నీ నవ్వు చెప్పింది నాతో అనే పాటని రీమిక్స్ చేసి ఈ ఇద్దరి లెస్బియన్స్ మధ్య పెట్టాడు. ఇలా ఆలోచించడం ఆయనకి మాత్రమే సాధ్యం కదా, అందుకే వర్మ కాకా, నువ్వు కేక. అన్నట్లు ఈ డేంజరస్ క్రైమ్ డ్రామాని స్పార్క్ ఓటీటీలో త్వరలో చూడొచ్చు.