జూన్ 11న ఫ్యామిలీ మ్యాన్ 2 రిలీజ్…

ఇండియన్ వెబ్ సిరీస్ లో ఫ్యామిలీ మ్యాన్ కి ఉన్న క్రేజ్ వేరు. సైలెంట్ గా వచ్చి అందరినీ మెప్పించిన ఈ వెబ్ సిరీస్ ఇండియాస్ మోస్ట్ టాప్ రేటెడ్ సిరీస్ ల్లో ఒకటి. మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్ ప్లే చేసి ఈ సిరీస్ కి సీక్వెల్ అనౌన్స్ చేసి చాలా రోజులే అయ్యింది. షూటింగ్ పార్ట్ కూడా పూర్తయ్యింది కానీ ఇదిగో రిలీజ్ డేట్, అదిగో రిలీజ్ డేట్ అంటూ ఫ్యాన్స్ ని ఊరిస్తున్నారు కానీ ఎలాంటి అప్డేట్ మాత్రం రాలేదు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న ఈ సీక్వెల్ విడుద‌ల‌పై ఫైనల్ గా ఒక క్లారిటీ వ‌చ్చింది. హిందీ, తెలుగు, త‌మిళం, ఇంగ్లీష్ భాష‌ల్లో వ‌స్తున్న ది ఫ్యామిలీ మ్యాన్ 2ను జూన్ 11న విడుద‌ల చేస్తార‌ని సమాచారం. అమెజాన్ ప్రైమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఫ్యామిలీ మ్యాన్ 2 అదే డేట్ కి వస్తుందా లేక మళ్లీ వాయిదా పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.