వృద్ధాప్యం రాకుండా వర్మ టాబ్లెట్…

రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన సంచలనమే… ఆయన సినిమాలే కాదు ఆయన ఆలోచనలు కూడా కొత్తగానే ఉంటాయి. మనిషి పుట్టాలి పెరగాలి వయసు మీద పడాలి చివరకి చనిపోవాలి. ఇది సృష్టి ధర్మం, ఈ ధర్మానికి వ్యతిరేకంగా ఆలోచించడం అనేది వర్మకి మాత్రమే సాధ్యం అవుతుంది. అసలు విషయానికి వస్తే డేంజరస్, డి కంపెనీ సినిమాలతో త్వరలో ప్రేక్షకులని ఓటీటీలో పలకరించబోతున్న వర్మ, టాబ్లెట్ అనే ఒక మూవీ పోస్టర్ ని రిలీజ్ చేశాడు.

పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు వర్మ నుంచి కొత్త కాదు కదా అనుకోకండి ఇది నిజంగా కొత్తదే. స్పార్క్ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ వృద్ధాప్యం రాకుండా ఉండే టాబ్లెట్ గురించి కావడం విశేషం. వయసు మీద పడకుండా ఉండడం వరమే కాదు శాపం కూడా ఈ విషయాన్నే టాబ్లెట్ మూవీలో చూపించబోతున్నారు. కాకపోతే ఇది వర్మ డైరెక్ట్ చేస్తున్న సినిమా కాదు, కమల్ ఆర్ అనే వ్యక్తి డైరెక్ట్ చేస్తున్న సినిమా. ఆలోచన కొత్తగానే ఉంది మరి సినిమా కూడా అంతే కొత్తగా ఉంటే బ్రేక్ ఇవ్వడానికి సినీ అభిమానులు ఎప్పుడూ రెడీ గానే ఉంటారు.