మెగాస్టార్ లూసిఫర్ రీమేక్ కోసం సీనియర్ రైటర్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ కాబోతున్నారు. ఆచార్య సినిమా ఇంకా పూర్తి కాలేదు అప్పుడే మరో మూడు సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. మెహర్ రమేష్ తో వేదాళం రీమేక్ చేయనున్న మెగాస్టార్ ఆ తరువాత బాబీ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.

ఇక వినాయక్ తో లూసిఫర్ ని రెడీ చేయనున్నాడు. ఆ రీమేక్ కోసం సీనియర్ రైటర్ ఆకుల శివ రైటర్ గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తులసి, లక్ష్మీ, కృష్ణ, నాయక్ వంటి కమర్షియల్ మాస్ సినిమాలకు రైటర్ గా వర్క్ చేసిన శివ, వినాయక్ తో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నాడు. ఇక ఫైనల్ గా మెగాస్టార్ సినిమా కోసం మరొకసారి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి ఎంతవరకు వరకు సక్సెస్ అవుతారో చూడాలి.