‘అల్లు’ వారి కాంపౌండ్ మరో కొత్త స్టూడియో..

టాలీవుడ్ ఎవర్ గ్రీన్ హాస్య నటుడు అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు గురువారం ఒక స్పెషల్ న్యూస్ తో వార్తల్లో నిలిచారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన కుటుంబసభ్యులు అల్లు స్టూడియోస్ ప్రారంభించారు.  అల్లు రామలింగయ్య జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా అల్లు స్టూడియోని ఏర్పాటు చేశారు.

ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుందట. అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక అల్లు అరవింద్ స్థాపించిన గీత ఆర్ట్స్ ఇప్పటికే స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దానికి కొనసాగింపుగా చిన్న సినిమాల కోసం GA2 సంస్థను ఏర్పాటు చేసి మంచి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ఇప్పుడు
తన ముగ్గురు తనయులతో కలిసి కొత్త స్టూడియోను ఎంతో ఉత్సాహంగా లాంచ్ చేసిన అల్లు అరవింద్ త్వరలో ఒక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.