సాహసం దర్శకుడితో నితిన్ న్యూ మూవీ.. టైటిల్ ఫిక్స్

యువ హీరో నితిన్ గ్యాప్ లేకుండా సినిమాలను సెట్స్ పైకి తెస్తున్నాడు. భీష్మ హిట్ తరువాత ఫామ్ లోకి వచ్చిన నితిన్ ఇక నెక్స్ట్ కూడా అదే తరహాలో హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా చేస్తున్న నితిన్ ఆ తరువాత సాహసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో మరో సినిమాను రిలీజ్ చేయనున్నాడు.

ఇక వీరి కాంబినేషన్ లో రానున్న సినిమా యొక్క ఫస్ట్ లుక్ టైటిల్ ని కొరటాల శివ చేత సోషల్ మీడియాలో రిలీజ్ చేయించారు. ఇక సినిమము ‘చెక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వినూత్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ ఈ సారి ఎలాగైనా నితిన్ తో బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.