మెగాస్టార్ తో మరో మెడికల్ సంచలనం!

శివ సినిమా తర్వాత తెలుగు సినీ ప్రపంచాన్ని ఒక్క కుదుపు కుదిపిన సినిమా అర్జున్ రెడ్డి. మూడు గంటల సినిమాని ప్రేక్షకులు చూస్తారా? ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న హీరో పై అయిదు కోట్లు ఖర్చు పెడితే బిసినెస్ అవుతుందా? బోల్డ్ కంటెంట్ తో ప్రమోట్ చేస్తే కల్ట్ క్లాసిక్ అవుతుందా? ఒక కొత్త దర్శకుడు ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించగలడా? ఇలా అర్జున్ రెడ్డి సినిమాకి ముందు ఉన్న ప్రశ్నలు ఎన్నో, అలాంటి సమయంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన అర్జున్ రెడ్డి కల్ట్ మూవీగా నిలబడింది. ఈ హిట్ ఇచ్చిన మత్తు నుంచి ఇంకా టాలీవుడ్ పూర్తిగా బయటకి రాలేదు అంటే అర్జున్ రిజల్ట్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమా చేసిన సందీప్ రెడ్డి వంగ నుంచి మరో తెలుగు సినిమా రాలేదు. బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత, పాత్ బ్రేకింగ్ సినిమా ఇచ్చిన తర్వాత సందీప్ నుంచి వచ్చే సినిమా ఎలా ఉండాలి? ఏ స్థాయిలో ఉండాలి? అందులో ఎలాంటి హీరో ఉండాలి? ఈ ప్రశ్నల్లోనే భారీ సినిమా కావాలి, పెద్ద హీరో కావాలి… మరోసారి ఇండస్ట్రీని కదిలించే సినిమా కావాలి అందుకే సందీప్ వంగ సమయం తీసుకున్నాడు. దాని రిజల్ట్ మెగా స్టార్ చిరంజీవితో సినిమా అయ్యే అవకాశం ఉంది. చిరంజీవితో సినిమా అనేది ఏ దర్శకుడికి అయినా ఒక డ్రీమ్, ఇప్పుడు అదే డ్రీం ని నిజం చేయడానికి సందీప్ రెడ్డి సిద్దమయ్యాడు.

చిరు బాడీ లాంగ్వేజ్ కి సరిపడ సినిమా చేయడానికి అవసరం అయ్యే కథని సందీప్ రెడ్డి వంగ రెడీ చేశాడట. కథ చెప్పడానికి అప్పోయింట్మెంట్ కూడా తీసుకున్నాడని సమాచారం. అయితే అర్జున్ రెడ్డిని మెడికల్ బ్యాక్ డ్రాప్ లో చేసిన సందీప్, చిరుతో కూడా మెడికల్ బ్యాక్ డ్రాప్ నే ఎంచుకున్నాడట. ఆర్జీవీతో సినిమా చేయని మెగాస్టార్, ఇప్పుడు న్యూ ఏజ్ ఆర్జీవీ అనే పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగతో సినిమా చేస్తాడా? అది మరో ఇండస్ట్రీ హిట్ అవుతుందా అనేది తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.