ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో దెబ్బకి రికార్డులు చెల్లాచెదురు

దర్శక దిగ్గజం రెండేళ్లుగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. కీరవాణి ఇచ్చిన టేర్రిఫిక్ మ్యూజిక్ కి, బ్లేజ్ పాడిన ర్యాప్ కి ఈ 1:48 నిడివి గల వీడియో అందరి ఫోన్స్ లో సునామినే సృష్టిస్తోంది. యుట్యూబ్ నుంచి సోషల్ మీడియా వరకూ ఎక్కడ చూసినా ఆర్ ఆర్ ఆర్ జపం జరుగుతోంది. రాజమౌళి టీం ఇంట్రడక్షన్ తో మొదలైన ఈ వీడియోలో ట్రిపుల్ ఆర్ గ్రాండియర్ ని ప్రెజెంట్ చేస్తూ భారి సెట్స్ ని, ఫాస్ట్ పేస్ యాక్షన్ ఎపిసోడ్స్ మేకింగ్ ని సుపర్బ్ గా ప్రెజెంట్ చేశారు. ఎన్టీఆర్ చరణ్ తో పాటు మెయిన్ కాస్ట్ అందరినీ అక్కడక్కడా చూపించిన మేకింగ్ వీడియో ఆర్ ఆర్ ఆర్ స్థాయి ఏంటో ప్రపంచానికి చూపించింది. ఇది కదా రాజమౌళి సినిమా అంటే అని నిరూపించింది. ముఖ్యంగా ఎన్టీఆర్ చరణ్ ల షాట్స్ మేకింగ్ లోనే ఇలా ఉంటే తెరపై ఎలా ఉంటుందో అనే ఊహకే గూస్ బంప్స్ రావడం గ్యరెంటి. మొత్తానికి బ్లాక్ బస్టర్ సినిమా రేంజ్ ఎలా ఉండబోతుందో చూపిస్తూ వచ్చిన ఈ మెస్మరైజింగ్ మేకింగ్ వీడియో మన సినిమా స్థాయిని మరోసారి అందరికీ తెలిసేలా చేసింది. మేకింగ్ వీడియో రిలీజ్ అయిన 24 గంటల్లోనే 425 k లైకులు సాధించడమే కాక…6.2 మిలియన్ వ్యూస్ సింగిల్ ఛానల్ లో సాధించి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 48 గంటల్లో ఈ ఆర్ ఆర్ ఆర్ మేకింగ్ వీడియో 8.1 మిలియన్ వ్యూస్ రాబట్టి జెట్ స్పీడ్ లో 10 మిలయన్ వ్యూస్ వైపు వెళ్తోంది.