ప్రమోషనల్ సాంగ్ అదిరింది…

టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్, టాక్సీవాలా బ్యూటీ ప్రియాంక జవాల్కర్ కలిసి నటిస్తున్న సినిమా తిమ్మరుసు. కన్నడ మూవీ బీర్బల్ ట్రైయాలజి కేస్ 1: ఫైండింగ్ వజ్రముని సినిమాకి తిమ్మరుసు రీమేక్.  ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌.ఒరిజినల్స్‌ బ్యానర్లు ఈ మూవీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈనెల 30న థియేటర్లలో విడుదల చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతబడ్డ ధియేటర్లు ఇప్పుడిప్పుడే ఓపెన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. పోస్ట్ సెకండ్ వేవ్, ధియేటర్ లో రిలీజ్ అవనున్న మొదటి సినిమా తిమ్మరుసు. రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడంతో మేకర్స్ తిమ్మరుసు థీమ్ సాంగ్ ని స్టార్ హీరోయిన్ సమంతతో విడుదల చేయించారు.

మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల కంపోజ్ చేసిన ఈ సాంగ్ లో మెయిన్ కాస్ట్ అంతా ఉన్నారు. న్యాయ దేవతే నల్లకోట వేసుకొని, ప్రాణం పోసుకొని నీలాగా వచ్చిందా అన్నట్లు సాగిన ఈ పాట, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సత్య దేవ్ యాటిట్యూడ్, ప్రియాంక జవాల్కర్ గ్లామర్ ఈ సాంగ్ కి మెయిన్ హైలైట్ అయ్యాయి. మంచి మేకింగ్ తో వచ్చిన ఈ సాంగ్ కి ప్రియాంక గ్లామర్ అవుట్ స్టాండింగ్ ఎస్సెట్ అయ్యింది. ఎప్పుడూ చీరల్లో కనిపించే ఈ బ్యూటీ షాట్స్ లో కొత్తగా కనిపించింది.