రాకీ భాయ్ కి సలామ్ కొడుతున్న యుట్యూబ్

కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కేజీఎఫ్ 2’ టీజర్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తూ పాత రికార్డులను బద్ధలు కొడుతోంది. విడుదలైన 24 గంటల్లోనే 78 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించిన ఈ టీజర్ 4.3 మిలియన్ లైక్స్‌ని సంపాదించింది. దీంతో సౌత్ ఇండియాలోనే తక్కువ వ్యవధిలో అత్యధిక వ్యూస్, లైక్స్ సాధించిన సినిమా టీజర్‌గా నిలిచింది. ఇక్కడితో ఆగని kgf 2 టీజ‌ర్ రికార్డ్స్, విడుద‌లైన 48గంట‌ల్లోపే ఈ చిత్రం 100మిలియ‌న్స్ వ్యూస్ ద‌క్కించుకుంది. ఒక రీజనల్ సినిమా కలలో కూడా ఊహించని రికార్డు ఇది. సరే ఆల్ ఇండియా హైప్ ఉంది కాబట్టి 100 మిలియన్ వ్యూస్ పెద్ద విషయం కాదులే… పైగా సింగల్ లాంగ్వేజ్ టీజర్, సో అన్ని భాషల వాళ్లు ఈ టీజర్ చూస్తారు ఆటోమేటిక్ వ్యూస్ వస్తాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు kgf 2 టీజర్ సృష్టించిన రికార్డు ఇకపై ఇండియాలో ఎవరూ టచ్ చేయలేరేమో. 200 మిలియన్ వ్యూస్ సాదించిన టీజర్, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. 8.4 మిలియన్ లైక్స్ తో 200 మిలియన్ వ్యూస్ మార్క్ ని రీచ్ అయిన kgf2 టీజర్, ఈ ప్రాజెక్ట్ పై ఉన్న హైప్ ఎలాంటిదో మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సంధర్భంగా మేకర్స్ 200 మిలియన్ వ్యూస్ గ్లిప్స్ ని రిలీజ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ రాకుంటే నిన్న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ నిరవధికంగా వాయిదా పడింది. థియేటర్స్ అన్ని ఏరియాలలో పూర్తి స్థాయిలో ఓపెన్ అయితేనే రాకీ భాయ్ అందరి ముందుకి రానున్నాడు. అప్పటివరకూ ఎదురు చూస్తూ ఉండాల్సిందే.