విజ‌య్ ఆంటోని రిలీజ్ చేసిన రాయ్‌ల‌క్ష్మి ‘సిండ్రెల్లా` మూవీ టీజ‌ర్!!

ద‌క్షిణాదితో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న గ్లామ‌ర్ డాల్ ‘రాయ్‌ల‌క్ష్మి ద్విపాత్రాభిన‌యం చేసిన చిత్రం ‘సిండ్రెల్లా’. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన ఈ చిత్రాన్ని తెలుగులోనూ అదే పేరుతో సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్ ప‌తాకాల‌పై మంచాల ర‌వికిర‌ణ్, ఎం.ఎన్‌.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. ఎస్‌.జె.సూర్య ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేసిన విను వెంక‌టేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

ఈ సినిమా టీజ‌ర్‌ను విజ‌య్ ఆంటోని రిలీజ్ చేశారు. హార‌ర్ ఫాంట‌సీ, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. స‌ర్కార్ 3, కిల్లింగ్ వీర‌ప్ప‌న్ చిత్రాల‌కు కెమెరామెన్‌గా వ‌ర్క్ చేసిన ర‌మ్మీ ఈ సినిమా సినిమాటోగ్రఫీ అందించారు. కాంచ‌న 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అలాగే గేమ్ ఓవ‌ర్ చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన స‌చిన్ ఈ చిత్రానికి చేసిన సౌండ్ డిజైనింగ్ హైలైట్ కానుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని నిర్మాత‌ మంచాల ర‌వికిర‌ణ్‌, స‌హ నిర్మాత‌ ఎం.ఎన్‌.రాజు తెలిపారు.

న‌టీన‌టులు:
రాయ్ ల‌క్ష్మి, రోబో శంక‌ర్‌, అభిన‌య‌, అర‌వింద్ ఆకాశ్‌, సాక్షి అగ‌ర్వాల్‌, వినోద్‌, అన్బు త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్‌: సుదీక్ష ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎంఎన్ఆర్ మూవీస్
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: విను వెంక‌టేశ్‌
నిర్మాత‌: మంచాల ర‌వికిర‌ణ్‌, ఎం.ఎన్‌.రాజు
సినిమాటోగ్రాఫ‌ర్‌: ర‌మ్మీ,
ఎడిట‌ర్‌: లారెన్స్ కిషోర్‌
మ్యూజిక్‌: అశ్వామిత్ర‌
పీఆర్ఓ: తేజ‌స్వి స‌జ్జ