రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి కొత్త అప్‌డేట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ కలిసి నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. దర్శకుడు శంకర్ రూపుదిద్దుతున్న ఈ చిత్రం SVC బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా సాంగ్ మంచి బజ్ తెప్పించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 20 నుండి రాజాముందరి, ఆ తరువాత విశాఖపట్నంలో జరగనున్నట్లు తెలుస్తుది. అయితే ఈ షెడ్యూల్ 9 నుండి 10 రోజులు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించనున్నారు.