‘మనం సైతం’ ద్వారా మరోసారి మానవత్వం చాటుకున్న కాదంబరి కిరణ్

నటుడు కాదంబరి కిరణ్ గారు అంటే తెలియని వారు తెలుగు చిత్ర పరిశ్రమలో లేదు అని చెప్పుకోవాలి. కాదంబరి కిరణ్ గారు ఫౌండేషన్ ద్వారా మనం సైతం స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. తనకు వీలైనంతవరకు ప్రజా సేవ చేయడానికి ఈ మనం సైతం ద్వారా చేస్తున్నారు. అయితే ఇటీవలే సినీ సౌండ్ ఇంజనీర్ ఈమని శ్రీనివాస్ గారికి కిడ్నీలు ఫెయిల్ కావడం జరిగింది. తన భార్య ఆయనకు కిడ్నీ ఇచ్చి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ద్వారా వైద్యం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆపరేషన్ కి ఖర్చులకు గాను మనం సైతం నుండి కాదంబరి కిరణ్ గారు 25 వేల రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. తన భర్త ఆపరేషన్ కోసం మనం సైతంకు అభ్యర్థిగా వెంటనే కాదంబరి కిరణ్ గారు సాయం చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ మనిషి గారి భార్య కిరణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ఇటీవలే సూర్యాపేటకు చెందిన రిపోర్టర్ వై. రవికుమార్ తల్లి తారమ్మ గారికి కిడ్నీలు దెబ్బతిన్నాయి. తన తండ్రికి కాలు ఇన్ఫెక్షన్ ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వారి వైద్యవసరాలు కోసం 25000 ఆర్థిక సాయం మనం సైతం ద్వారా కాదంబరి కిరణ్ గారు చేయడం జరిగింది. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు ఎల్ ప్రసాద్ కంటి ఆపరేషన్ కోసం 25000 ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ విధంగా గత పది సంవత్సరాలుగా కాదంబరి కిరణ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు కనకదుర్గమ్మ చేస్తూ వస్తున్నారు.