‘పుష్ప-2’ టీజర్ బయటకి వచ్చే టైం ఎప్పుడంటే

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్పా ద రూల్ టీజర్ త్వరలోనే రానుంది. రేపు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేస్తాం అని ఇప్పటికే మేకర్స్ ప్రకటన ఇవ్వగా, ఇప్పుడు ఏ సమయంలో టీజర్ విడుదల కానుందో కూడా చెప్పేసారు. రేపు ఉదయం 11:07 సమయానికి పుష్ప ద రూల్ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటిస్తున్న ఈ సినిమా సుకుమార్ దర్శకత్వలో రానుంది. పుష్ప ద రిసె ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్లు రాబట్టగా, ఈ సినిమాపైన అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.