ర‌కుల్ యోగాస‌నం.. నేను ఎక్క‌డ ఉన్నా అంటూ పోస్ట్‌!

ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ప‌లు భాష‌ల్లో సినిమాలు చేస్తూ సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో అగ్ర క‌థానాయిక‌ల్లో ఒక‌రిగా పేరు తెచ్చుకున్న ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో దూసుకుపోతున్న‌ది. అయితే ఉద‌యాన్నే యోగా, జిమ్‌ చేసే ఈ భామ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వ్యాయామానికి గ్యాప్ ఇవ్వ‌దు. సినిమా షూటింగ్‌ల‌కు గ్యాప్ ఇచ్చిన‌ప్ప‌టికీ, వ్యాయ‌మాన‌కి మాత్రం బ్రేక్ ఇవ్వ‌దు ర‌కుల్‌. ఎక్క‌డ ఉన్నా.. యోగాస‌నాలు మాత్రం వేసి తీరుతుంది.

rakul yogasanam pose

ఈ నేప‌థ్యంలోనే ఓ యోగాస‌నం వేసి దీనికి సంబంధించిన ఫోటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో యోగాస‌నాల్లో అత్యంత శ‌క్తివంత‌మైన హ‌లాస‌నం వేసి.. నేను ఎక్క‌డ ఉన్నాను అంటూ పోస్ట్ చేసింది. దీంతో సోష‌ల్‌మీడియాలో ర‌కుల్‌ప్రీతిసింగ్ బాడీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. ఇక ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ స్టార్ అజ‌య్‌దేవ్‌గ‌ణ్ జోడీగా మేడే చిత్రంలో న‌టిస్తోండ‌గా.. అనంత‌రం అజ‌య్‌దేవ్‌గ‌ణ్‌, సిద్ధార్థ్ మ‌ల్హోత్రా ప్ర‌ధాన పాత్ర‌ల్లో థాంక్ గాడ్ అనే చిత్రంలో కూడా ర‌కుల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమాను టీ-సిరీస్ భూష‌ణ్ కుమార్ నిర్మిస్తుండ‌గా.. ఈనెల 21నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదివ‌రకే అజ‌య్‌దేవ్‌గ‌ణ్ తో దే దే ప్యార్ దే, సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో మ‌ర్జావాన్ సినిమాల‌లో ర‌కుల్ హీరోయిన్ పాత్ర‌లో న‌టించింది.‌