బాబుకు షాక్… సీఎం జగన్‌తో భేటీ కానున్న బాలయ్య

త్వరలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నట్లు నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టీడీపీ వర్గాలను షాక్‌కు గురి చేస్తున్నాయి. టీడీపీ, వైసీపీ ప్రత్యర్థి పార్టీలు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో జగన్‌ను బాలయ్య కలవనుండటం ఆశ్చర్యకరంగా మారింది.

balayya meet jagan

గత రెండు రోజులుగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలయ్య పర్యటిస్తున్నారు. స్థానికులను కలుసుకుని సమస్యలు తెసుకుంటున్నారు. ఈ సందర్భంగా త్వరలోనే సీఎం జగన్‌ను కలిసి హిందూపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను వివరిస్తానన్నారు. సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళతానన్నారు.

హిందూ దేవాలయాలు, విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులను బాలయ్య ఖండించారు. దేవతా విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితుల చేతులు కత్తిరించాలన్నారు.