స్టార్ డైరెక్టర్‌కు నో చెప్పిన ప్రభాస్

బాహుబలి తరువాత రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’, ‘రాధే శ్యామ్’ సినిమాలను పాన్ ఇండియా లెవల్లో భారీస్థాయిలో తెరకెక్కించినా.. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాయి. దీంతో రెబెల్ స్టార్ ప్రభాస్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌లను అచితూచి ఎంచుకుంటున్నాడు.

తాజాగా ప్రభాస్‌కు సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కోలీవుడ్ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఇటీవల ప్రభాస్‌కు ఓ కథ వినిపించాడట. ఆ స్టోరీ ప్రభాస్‌కు నచ్చలేదని టాక్. అయితే స్టోరీలో మార్పులు, చేర్పులు చేసి మళ్లీ ప్రభాస్‌కు చెప్పినా.. కథ ఆకట్టులేదని సమాచారం. అందుకే సింపుల్‌గా లోకేష్ కనగరాజ్‌కు నో చెప్పాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ మూవీలో నటిస్తున్నాడు. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలకు కూడా డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.