“ఆదిపురుష్” పై ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ బజ్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న చేసిన భారీ చిత్రాల్లో బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా పీరియాడిక్ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కగా ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా స్టార్ హీరోయిన్ కృతి సనన్ సీతగా కనిపించనున్నారు.

అయితే ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మన ఇండియన్ సినిమా దగ్గర ఒక భారీ విజువల్ వండర్ గా ప్రొజెక్ట్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా ప్రముఖ హాలీవుడ్ వి ఎఫ్ ఎక్స్ సంస్థ వారితో ఆదిపురుష్ గ్రాఫికల్ వర్క్స్ లో బజీగా ఉన్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ పరంగా అయితే మొదటి నుంచి మంచి హైప్ ఉంది మరి సినిమాలో ఏ రేంజ్ లో విజువల్స్ కనిపిస్తాయో చూడాలి.