Radheshyam: ప్ర‌భాస్ “రాధేశ్యామ్” టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది..

Radheshyam: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ టీజ‌ర్ అప్‌డేట్ వ‌చ్చేసింది. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతున్న పీరియాడిక్ ల‌వ్‌స్టోరీ రాధేశ్యామ్ చిత్ర టీజ‌ర్‌ను వాలంటైన్స్‌డే సంద‌ర్భంగా ఈ నెల ఫిబ్ర‌వరి 14న రిలీజ్ చేస్తారట చిత్ర‌బృందం. ప్ర‌భాస్ చివ‌రి చిత్ర‌మైన సాహో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి.. బాలీవుడ్‌లో త‌ప్ప మ‌రో భాష‌లో ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేదు.

prabhas radeshyam

ఇప్పుడు ప్ర‌భాస్ అభిమానులు Radheshyam రాధేశ్యామ్ విడుద‌ల కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఇందులో ప్ర‌భాస్ స‌ర‌స‌న పూజాహెగ్దే హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒక‌వైపు స‌లార్ చిత్రిక‌ర‌ణ‌లో పాల్గొన‌గా.. మ‌రోవైపు ప్ర‌భాస్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్ చిత్రం షూటింగ్ జ‌రుగుతుంది. అనంత‌రం నాగ్అశ్విన్ డైరెక్ష‌న్‌లో సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కుతున్న సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు.