పైరసీ చేస్తే ఈ నెంబర్‌కు కాల్ చేయండి

100 శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ ఇప్పుడు సరికొత్తగా తన వరల్డ్‌ డిజిటల్‌ ప్రీమియర్‌గా ‘క్రాక్‌’ సినిమాను ఫిబ్రవరి 5 నుంచి స్ట్రీమింగ్ చేస్తోంది. మాస్‌ మహారాజ రవితేజ, శ్రుతిహాసన్‌ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని తెరకెక్కించాడు. ‘క్రాక్‌’ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం కానీ, నిబంధనలు ఉల్లంఘించి కాపీ చేసుకోవడం, రికార్డింగ్‌ చేసుకోవడం, ప్రసారం చేయడం వంటి పనులు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహా యాజమాన్యం హెచ్చరించింది.

krack piracy

క్రాక్‌ మూవీ పైరసీ చేస్తున్నట్లు తెలిసినా, సమాచారం ఉన్నా క్రాక్‌ యాంటీ పైరసీ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 9393950505 లేదా apc50505@gmail.com ద్వారా ఫిర్యాదు చేయాలంది. పైరసీ చేస్తు్న్నట్లు నిర్ధారణ అయితే, సదరు వ్యక్తులు లేదా సమూహంపై సివిల్‌, క్రిమినల్‌ చర్యలను తీసుకుంటామంది.