‘సత్య’ సినిమాలోని సాంగ్ రిలీజ్ చేసిన కాజల్ అగర్వాల్ – మే 10న సినిమా రిలీజ్

శివమ్ మీడియా నుండి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సత్య సినిమా నుండి ‘నిజమా ప్రాణమా’ లిరికల్ వీడియోని నటి కాజల్ అగర్వాల్ లాంచ్ చేశారు. ఇప్పటికే సత్య టీజర్, ట్రైలర్, సాంగ్ కి ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ లభించింది. అలాగే ఈ నిజమా ప్రాణమా కూడా అనూహ్య స్పందన వస్తుంది. 90s లో పుట్టిన వారందరికీ ఈ సాంగ్ నోస్టలాజిక్ ఫీలింగ్ లోకి తీసుకుని వెళ్తుంది, ప్రార్థన సందీప్ హమరేష్ పెర్ఫార్మన్స్ చాలా చక్కగా ఉన్నాయని నెటిజన్లు ప్రసంసలు కురిపిస్తున్నారు.

రాంబాబు గోసాల అద్భుతమైన లిరిక్స్ ని అందించారు, సుందరమూర్తి కేఎస్ సంగీతం మనసుకు హత్తుకునేలా ఉంది. వాలి మోహన్ దాస్ డైరెక్ట్ చేసిన విధానం ఆ ఎమోషన్ ని క్యారీ చేసిన విధానం తన ప్రతిభని కనపరిచింది.

నిర్మాత శివ మల్లాల మాట్లాడుతూ: కాజల్ అగర్వాల్ నాకు తన లక్ష్మి కళ్యాణం సినిమా నుండి పరిచయం, తక్కువ టైమ్ లోనే కాజల్ చాలా క్లోజ్ అయ్యారు, “స్పెషల్ చబ్బీస్” సినిమా అప్పుడు నన్ను పర్సనల్ గా అక్షయ్ కుమార్ గారికి పరిచయం చేశారు, ఆ సినిమాకి నేను పిఆర్ఓ గా వ్యవహరించాను. మొదటి సారి నిర్మాతగా చేస్తున్న సినిమాకి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నందుకు కాజల్ కు థాంక్స్ చెప్పారు.

కాజల్ అగర్వాల్ లిరికల్ వీడియోని లాంచ్ చేస్తు ‘నిర్మాత శివ మల్లాలతో తనకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ‘శివ గారు నాకు ఎప్పటి నుండో తెలుసు, మా ఇద్దరికీ వృత్తి రీత్యా అద్భుతమైన అనుబంధం ఉంది. శివ గారి సత్య సినిమా, నా సినిమా సత్య భామ రెండు పేర్లు చాలా దగ్గరా ఉన్నాయ్’ అని సరదాగా అన్నారు.

తారాగణం : హమరేశ్, ప్రార్ధన సందీప్, ఆడుగాలం మురుగదాస్, సాయిశ్రీ, అక్షయ

సాంకేతిక సిబ్బంది :

సంగీతం– సుందరమూర్తి కె.యస్

ఎడిటింగ్‌– ఆర్‌.సత్యనారాయణ

కెమెరా– ఐ. మరుదనాయగం

మాటలు– విజయ్‌కుమార్‌

పాటలు– రాంబాబు గోసాల

పీఆర్‌వో–వి.ఆర్‌ మధు, మూర్తి మల్లాల

లైన్‌ ప్రొడ్యూసర్‌– పవన్‌ తాత

నిర్మాత– శివమల్లాల

రచన–దర్శకత్వం– వాలీ మోహన్‌దాస్