ఆదిపురుష్‌లో మరో బాలీవుడ్ హీరో?

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ మేరకు పూజాకార్యక్రమాలు నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ రాముడిగా కనిపించనుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో వార్త వైరల్‌గా మారింది. ఇందులో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించనున్నట్లు వినికిడి.

AJAYDEVAGAN IN ADIPURUSH

శివుడిగా అజయ్ దేవగణ్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో ఓం రౌత్ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ తన్హాజీ అనే సినిమా చేయగా.. అది భారీ విజయం సాధించింది. అజయ్ దేవగణ్, ఓం రౌత్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదిపురుష్‌లో నటించేందుకు అజయ్ దేవగణ్ ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. కాగా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRRలో అజయ్ దేవగణ్ నటిన్నాడు.