పవన్ తర్వాతి సినిమా ఎవరితో తెలుసా?

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటిస్తుండగా.. ఆయన తర్వాత చేయబోయే సినిమా ఏంటీ? అనేది పెద్ద ఆసక్తికరంగా మారింది. పవన్ తన తర్వాతి సినిమాను క్రిష్ జాగర్లమూడితో చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. నవంబర్ చివరినాటికి పూర్తి షూటింగ్ కంప్లీట్ అవ్వనుందని తెలుస్తోంది.

pawan kalyan

ఇది పూర్తి అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించనున్నాడు. పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. సినిమా పేరును కూడా వెల్లడించనున్నారు.

ఇప్పుడు పవన్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో విడుదలై సూపర్ హిట్ అయిన ‘పింక్’ సినిమాను తెలుగులో ‘వకీల్ సాబ్’ పేరుతో తెరకెక్కిస్తున్నారు.