ఛార్మి 9 నెలల కొడుకుతో ప్రభాస్.. ఏం చేస్తున్నారంటే?

ఒక పెంపుడు కుక్కతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు బాగా షేర్ చేస్తున్నారు. నటి, నిర్మాత ఛార్మి ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ‘నా 9 నెలల కొడుకుతో డార్లింగ్’ అంటూ ఛార్మి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.

prabhas

ప్రభాస్ ఫొటో దిగిన ఆ పెంపుడు కుక్కను ఛార్మి గత కొంతకాలంగా పెంచుకుంటోంది. దాని వయస్సు 9 నెలలు. అలస్కన్ మలమ్యూట్ జాతికి చెందిన ఆ శునకం చూడటానికి అచ్చం సింహంలా ఉంటుంది. దానిని ఛార్మి తన సొంత కొడుకులా చూసుకుంటుంది.

తాజాగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి ఆఫీస్‌కు ప్రభాస్ వచ్చాడు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఈ శునకంతో ప్రభాస్ ఫొటో దిగాడు. పూరి,ఛార్మి కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇప్పుడు వారి ఆఫీస్‌కు ప్రభాస్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.