హీరో రానా కొత్త బిజినెస్

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కొత్త బిజినెస్ మొదలుపెట్టాడు. సొంత యూట్యూబ్ ఛానెల్ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. ‘సౌత్ బే’ అనే పేరుతో ప్రారంభించనున్న ఈ యూట్యూబ్ ఛానెల్‌లో మల్టీలింగ్వల్ కంటెంట్‌ను అందించనున్నాడు. ఛానెల్‌కి సంబంధించి వై ఆర్ యూ అంటూ ఒక పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో రానా విడుదల చేశాడు.

rana daggubati

ఈ పోస్టర్‌లో ఐదుగురు వ్యక్తులు కనిపిస్తుండగా.. అందులో ముగ్గురికి రానా ఫేస్ మాస్క్ ఉంది. మిగిలిన ఇద్దరిలో ఒకరికి పిల్లి, మరొకరికి కుక్క మొహాలు జత చేసి పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఈ యూట్యూబ్ ఛానల్‌లో పది సెకన్ల నుంచి 10 గంటల వరకు పలు భాషల్లో కథలను అందుబాటులో ఉంచుతారట. మ్యూజిక్, న్యూస్, యానిమేషన్, ఫిక్షన్ వంటి అంశాలు ఇందులో కనిపించబోతున్నాయట. టాలెంట్ ఉండి సరైన వేదిక లేనివారికి ఈ యూట్యూబ్ ఛానెల్ బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి చూడాలి రానా కొత్త బిజినెస్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో..