ఒలీవియా నామస్మరణతో మారుమోగుతున్న సోషల్ మీడియా

రాజమౌళి సినిమాలో నటించే అవకాశం కోసం చాలా మంది స్టార్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది చరణ్, ఎన్టీఆర్ లాంటి ఆర్ ఆర్ ఆర్ మాగ్నమ్ ఓపస్ లో అవకాశం వస్తే ఎలా ఉంటుంది? అసలు పేరు, ఊరు తెలియని వాళ్లు కూడా అభిమానం చూపిస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలు ఒలీవియా మోరిస్ ని అడిగితే పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. స్టేజ్ ఆర్టిస్ట్ అయిన ఒలీవియా మోరిస్, ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ పక్కన నటించనుంది. జెన్నిఫర్ గా కనిపించనున్న ఒలీవియా మోరిస్, ఇప్పుడు ఇంటెర్నేషల్ వైడ్ ట్రెండ్ అవుతుంది.

దాదాపు 200k మెంబర్స్ ఒలీవియా కోసం సెర్చ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది ఎన్టీఆర్ అభిమానులే ఉండడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ అనౌన్స్మెంట్ కి ముందు ఒలీవియా మోరిస్ కి ట్విట్టర్ లో 3k ఫాలోవెర్స్ ఉంటే, 24 గంటల్లో ఇది 17kకి చేరింది. ఒక్క రాత్రిలో 14 వేల మంది ఫాలోవెర్స్ పెరిగారు అంటే ఒలీవియా మోరిస్ అనే పేరు ఎంత స్ప్రెడ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. త్వరలో ఒలీవియా మోరిస్, జెన్నిఫర్ గా మారి ఆర్ ఆర్ ఆర్ షూట్ లో జాయిన్ అవనుంది.