ప్రపంచ సుందరికి ప్రియుడి బర్త్ డే స్పెషల్ సర్ప్రైజ్ ట్రీట్

బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ యూనివర్స్ సుష్మిత సేన్ కి ఆమె బాయ్ ఫ్రెండ్ రోహ్మన్ స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు. నవంబర్ 19న పుట్టిన సుష్మిత సేన్, ఈ ఇయర్ తో 44వ వయసులో అడుగుపెట్టింది. ఆమెని చూసిన వాళ్లు అసలు సుష్మితకి 44 ఏళ్లు అంటే నమ్మరు, అంత అందం ఫిట్నెస్ ఆమె సొంతం. ఇప్పటికీ స్వీత్ 30లా కనిపించే సుష్మిత పుట్టిన రోజు సందర్భంగా రోహ్మన్ సర్ప్రైజ్ పార్టీ ఇచ్చాడు. సుష్మిత ఇంట్లో నిన్న రాత్రి గ్రాండ్ గా జరిగిన ఈ స్పెషల్ పార్టీలో, ఆమె కూతుర్లు అలీషా, రెనీ కూడా పాల్గొనడం విశేషం.

View this post on Instagram

What a magical #birthday EVERYTHING I COULD’VE WISHED FOR & MORE❤️❤️❤️😁💃🏻🌈 Thank you jaan @rohmanshawl for this ALL HEART Birthday Surprise!!! I love you😍💋Everyone acted sooooo well…I really had no idea!!!😅👏 And there it was…a magical terrace with lights, balloons, tent, yummy cake & heartfelt notes suspended all over…How simply loved you make me feel Alisah, Renée, @rohmanshawl @pritam_shikhare @nupur_shikhare & Rajesh!!!🤗❤️😊Even my other baby, My puddle called #darling came to surprise me!!!😀😇🤗 #sharing #cherished #happiness #love #family #friends #celebrations #44yrs #birthdaygirl 😄💃🏻❤️🎵 I love you guys!! #duggadugga 💃🏻💃🏻💃🏻

A post shared by Sushmita Sen (@sushmitasen47) on

ఈ సర్ప్రైజ్ పార్టీలో రోహ్మన్ ఇచ్చిన సర్ప్రైజ్ సెలెబ్రేషన్స్ వీడియోని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన సుష్మిత సేన్, తన హ్యాపీనెస్ ని అభిమానులతో పంచుకుంది. “ఇంతకన్నా ఏం కావాలి, అందరూ చాలా బాగా నటించి మంచి సర్ప్రైజ్ ఇచ్చారు. ఇది ది బెస్ట్ బర్త్ డే” అంటూ రోహ్మన్ కి సుష్మిత స్పెషల్ థాంక్యూ చెప్పింది. 2015లో చివరగా నిర్బాక్ సినిమాలో నటించిన సుష్మిత సేన్, 2000లో ఒక అమ్మాయిని 2010లో ఇంకో అమ్మాయిని దత్తత తీసుకుంది.