ప్రతి ఏడాది ఇదే రోజున ఐశ్వర్య ఎందుకు ఈవెంట్ చేస్తుంది?

ప్రపంచ సుందరిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య రాయ్, తన తండ్రి పుట్టిన రోజు సందర్భంగా కృష్ణరాజుని గుర్తు చేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. కృష్ణరాజు ఫోటో షేర్ చేసిన ఐశ్వర్య, మిమ్మల్ని ఎప్పటికీ పేమిస్తునే ఉంటాను హ్యాపీ బర్త్ డే డాడీ అంటూ పోస్ట్ చేసింది. ప్రతి ఏడాది లాగే తండ్రి పుట్టిన రోజున ఐశ్వర్య డే ఆఫ్‌ స్మైల్స్‌ ఈవెంట్ సెలెబ్రేషన్స్ జరిగాయి. ఈ సమయంలో ఐశ్వర్య రాయ్, ఆమె అమ్మతో పాటు ఆరాధ్య రాయ్ బచ్చన్ కూడా ఉంది. ఈ ఈవెంట్ నుంచి వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

ఐశ్వర్య చివరగా 2018లో ఫన్నే ఖాన్ సినిమాలో నటించింది. ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడికల్ సినిమా పొన్నియన్ సెల్వన్ లో కీ రోల్ ప్లే చేస్తోంది. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.