ఆగని పోరు.. ఆహాపై నెట్‌ఫ్లిక్స్ పవర్‌ఫుల్ సెటైర్

లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో.. ఓటీటీలకు ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ఓటీటీల మధ్య పోటీ కూడా బాగా ఎక్కువైపోయింది. ఈ క్రమంలో ఓటీటీల మధ్య అంతర్గత యుద్ధం జరుగుతోంది. అందులో భాగంగా తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్, ప్రముఖ ఇంటర్నేషనల్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫిక్స్ మధ్య పోరు జరుగుతోంది. ఒకరిపై ఒకరు సెటైర్లు పేల్చుకుంటున్నారు.

netflix saitre on aha

ఇటీవల ఈ రెండు సంస్థలు సోషల్ మీడియాలో ఒకదానిపై ఒకటి సెటైర్ వేసుకోగా.. తాజాగా మరోసారి సెటైర్ల పర్వం మొదలైంది. తాజాగా ఆహాపై నెట్‌ఫ్లిక్స్ భారీ సెటైర్ వేసింది. ఏరా.. మీ ఇంట్లో అందరూ ఇలాగే తేడాగా మాట్లాడతారా అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన నెట్‌ఫ్లిక్స్..’ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను’ అంటూ ‘పోకిరి’ సినిమాలోని మహేష్ డైలాగ్ తో ఉన్న ఓ ఇమేజ్ పోస్ట్ చేసింది. దీంతో ఆహా మీద ఆ సెటైర్ వేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.