రికార్డులు క్రియేట్ చేస్తున్న అనుపమ షార్ట్ ఫిల్మ్

‘శతమానం భవతి’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. పెద్ద హీరోల సరసన కూడా అనుపమ అవకాశాలు కొట్టేస్తోంది. అయితే సినిమాలతో పాటు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్‌లలో కూడా అనుపమ నటిస్తోంది. తాజాగా మలయాళంలో ఫ్రీడమ్@ మిడ్ నైట్’ షార్ట్ ఫిల్మ్‌లో అనుపమ నటించగా.. ఇది యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

ANUPAMA PARAMESWARAN SHORT FILM

జనవరి 9న దీనిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయగా.. రికార్డు వ్యూస్ సాధించింది. ఇప్పటివరకు దాదాపు 5 మిలియన్ల వ్యూస్ సాధించింది. భర్త నుంచి ఎదురయ్యే బలవంతపు శృంగారం నుంచి ఫ్రీడమ్ కోరుకునే భార్య పాత్రలో అనుపమ ఇందులో నటటించింది. కాగా ప్రస్తుతం తెలుగులో నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్ సినిమాలో అనుపమ నటిస్తోంది. దీనికి సూర్య పల్నాటి దర్శకత్వం వహిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీవాసు దీనిని నిర్మిస్తున్నారు.