ఏ హీరోకి తగ్గేదే లే…

మెగా హీరోస్ అందరూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ప్రతి హీరో దాదాపుగా మూడు సినిమాలు లైన్ లో పెడుతున్నాడు. చిరంజీవి నుంచి మొన్న వచ్చిన వైష్ణ‌వ్ తేజ్ వరకూ అందరూ బిజీ షెడ్యూల్ తో గడుపుతున్నారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాతర్మే కాస్త స్లో అయ్యాడు కానీ ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా… స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యాడు.

ప్ర‌స్తుతం కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో గ‌ని.. అనిల్ రావిపూడి డైరెక్ష‌న్‌లో ఎఫ్ 3 చిత్రం చేస్తున్న ఈ మెగా ప్రిన్స్, తాజాగా మ‌రో మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ఛ‌లో, భీష్మ వంటి హిట్ మూవీస్ ఇచ్చిన వెంకీ కుడుములతో వరుణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ చేయబోతున్నాడట. ఇటీవ‌లే వెంకీ కుడుముల వ‌రుణ్ తేజ్‌కు క‌థ‌ను వినిపించడం అది నచ్చి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం రెండూ జరిగాయట. ప్రస్తుతం చేస్తున్న రెండు ప్రాజెక్ట్స్ అయిపోగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వెంకీ కుడుముల సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీడ్. ఎఫ్ 2తో తన కామెడీ టైమింగ్ ప్రూవ్ చేసుకున్న వరుణ్ తేజ్ కూడా కలిస్తే ఆన్ స్క్రీన్ ఫన్ రైడ్ జరగడం పక్కా. మరి ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ డీటెయిల్స్ ని ఎప్పుడు బయట పెడతారో చూడాలి.