కెరీర్ బెస్ట్ మూవీ బయటకి వస్తుందా?

దేశ ముదురు సినిమాతో తెలుగు సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన చ‌బ్బీ బ్యూటీ హ‌న్సిక. తెలుగులో అప్పుడప్పుడూ మెరుస్తున్న హన్సిక, తమిళ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసి స్టార్ డమ్ అందుకుంది. తన 16వ ఏట నుంచి అంటే 2007 నుంచి సినిమాలు చేస్తున్న హన్సిక మొత్వాని, ఇప్పటివరకూ మొత్తం 49 చిత్రాల్లో నటించింది. చిన్న వయసులో అన్ని సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ హన్సికనే అయి ఉండొచ్చు అయితే గత కొంత కాలంగా స్పీడ్ తగ్గించి కంటెంట్ పైన ద్రుష్టిపెట్టిన హన్సిక, తన 14 ఏళ్ల కెరీర్‌లో మోస్ట్ ప్రెస్టీజియ‌స్‌గా భావించి చేసిన సినిమా ‘మ‌హా‘. తన 50వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాపై హైకోర్టులో కేసు వేశారు. అది కూడా ఎవరో కాదు.. ఆ సినిమాను తెరకెక్కించిన చేసిన డైరెక్టరే కావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. హన్సిక నటించిన యాబైవ సినిమా ‘మహా’ . ఈ సినిమా. ఈ సినిమా కోసం మాజీ ప్రేమికుడు శింబుతో క‌లిసి న‌టించింది కూడా. గ‌త ఏడాదిలోనే సినిమాను విడుద‌ల చేయాల‌నుకున్న‌ప్ప‌టికీ క‌రోనా కార‌ణంగా వాయిదా వేస్తూ వ‌చ్చారు.

ఎట్ట‌కేల‌కు ఈ సినిమాను ఓటీటీలో విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే సినిమా ద‌ర్శ‌కుడు జ‌మీల్ సినిమా విడుద‌ల‌పై అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తూ మ‌ద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. సినిమాలో కొంత భాగాన్ని త‌న‌కు తెలియ‌కుండా, స‌హాయ ద‌ర్శ‌కుడి సాయంతో కంప్లీట్ చేశార‌ని, క‌థ‌కు అవ‌స‌ర‌మైన స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించ‌లేద‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు. అలాగే రెమ్యున‌రేష‌న్ చెల్లించ‌లేద‌ని, ఎడిటింగ్ కూడా త‌న ప్ర‌మేయం లేకుండా జ‌రిగింద‌ని జ‌మీల్ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఇప్ప‌టికే విడుద‌ల‌కు ఇబ్బంది ప‌డుతున్న హ‌న్సిక సినిమాకు ఇప్పుడు మ‌రో స‌మ‌స్య ఎదురు కావ‌డంతో అభిమానులు నిరాశ ప‌డ్డారు.