వారితో మెగా హీరోలకి కొత్త తలనొప్పి

సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ, అతితక్కువ సమయంలోనే సొంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. రీసెంట్ గా హీరోయిన్, సాంగ్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా కంప్లీట్ కథపైనే ఫోకస్ చేసిన ఖైదీ మూవీలో నటించిన కార్తీ సూపర్ హిట్ అందుకున్నాడు. కెరీర్ లో మొదటిసారి 100 కోట్ల మార్క్ ని టచ్ చేసిన కార్తీ, తన నెక్స్ట్ సినిమా తంబీని దొంగ పేరుతో తెలుగులో డబ్ చేయనున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ త్వరలో మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే దొంగ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి కార్తీ ప్లాన్ చేస్తున్నాడు.

కార్తీ నటించినా, నటిస్తున్న ఖైదీ దొంగ సినిమాల పేరుతో మెగాస్టార్ నటించేశాడు. మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌ని మలుపు తిప్పిన ‘ఖైదీ’ టైటిల్‌తో కార్తీ ఇప్పటికే ఒక బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చాడు, ఇది మర్చిపోయే లోపు ‘దొంగ’ పేరుతో చిరు మరో హిట్ కొట్టాడు. ప్లాన్డ్ గా చేశారో లేక యాదృచిక్కమో తెలియదు కానీ చిరులాగే కార్తీ కూడా ఖైదీ హిట్ అవగానే దొంగ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నాడు. మన నాని కూడా చిరు హిట్ సినిమా టైటిల్ గ్యాంగ్ లీడర్ తో సినిమా చేసేశాడు. చిరు టైటిల్స్ తో మెగా హీరోలు సినిమా చేస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు కానీ ఇక్కడ అందుకు పూర్తి విరుద్ధంగా సాగుతుంది. మెగా హీరోలు చిరు టైటిల్స్ ని పక్కన పెడితే, మిగిలిన హీరోలు మాత్రం హైప్ కోసం ఆ పేర్లని వాడేస్తున్నారు. ఈ తంతు చూస్తుంటే ఈ యంగ్ హీరోల నుంచి మెగా హీరోలకి పెద్ద తలనొప్పే వచ్చేలా ఉంది.