ఆ ఇద్దరి రాక వరుణ్ తేజ్ బాక్సర్ రేంజ్ పెంచింది…

F2, గద్దలకొండ గణేష్ సినిమాలతో 2019ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా బాక్సర్. రీసెంట్ గా లాంచ్ అయిన ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కనున్న బాక్సర్ ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాక్సర్ లో రమ్యకృష్ణ, మాధవన్ కలిసి నటించబోతున్నారట.

Varun Tej New Movie Launch

వరుణ్ తేజ్ కి అమ్మగా నటిస్తుండగా, మాధవన్ నాన్నగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. కథ నచ్చితేనో, పాత్రలో కొత్తదనం ఉంటేనో ఈ ఇద్దరూ ఓకే చెప్తారు. మరి బాక్సర్ లో ఈ పాత్రలు ఎలా ఉంటాయి, అవి సినిమాకి ఎలా హెల్ప్ అవుతాయి అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో అల్లు వెంకటేష్, సిద్ ముద్ద నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.