మ్యాచ్ రిజల్ట్ ని డిసైడ్ చేసే ఆ ఇద్దరూ లేకపోవడం లోటే

మరికొద్ది గంటల్లో అంగరంగ వైభవంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2020 ప్రారంభం కాబోతోంది. కరోనా నేపథ్యంలో ఇండియా నుంచి ఐపీఎల్‌ వేదిక యూఏఈకి మారిన విషయం విదితమే. రానున్న 52 రోజులు క్రికెట్‌ అభిమానుల్ని నరాలు తెగే ఉత్కంఠతో ఐపీఎల్‌ పోటీలు అలరించనున్నాయి. ముంబై ఇండియన్స్‌, చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య తొలి పోరు ఈ సీజన్‌లో జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పిన క్రికెటర్‌ ధోనీ, ఈ ఐపీఎల్‌ ద్వారా తన అభిమానుల్ని అలరించబోతున్నాడు. నాలుగు సార్లు ఛాంపియన్స్ Vs మూడు సార్లు ఛాంపియన్స్ మధ్య జరగనున్న ఈ ఫస్ట్ మ్యాచ్, ఐపీఎల్ కి మంచి టేకాఫ్ ఇవ్వనుంది.

ఈరోజు రాత్రి 7:30గంటలకి స్టార్ట్ అవనున్న మ్యాచ్ లో, IPL ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగనున్నాయి. వ్యక్తిగత కారణాలతో చెన్నై నుంచి రైనా ముంబై నుంచి మలింగ తప్పుకున్నారు. వీళ్లిద్దరూ IPL చరిత్రలో తమదైన ముద్ర వేశారు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రైనా(5,368) రెండో స్థానంలో ఉండగా, అత్యధిక వికెట్లు సాధించిన వీరుడుగా మలింగ(170) రికార్డు సృష్టించాడు. ఈ సీజన్ కు వీళ్లిద్దరూ దూరమయ్యారు. మిడిల్ ఆర్డర్ లో చెన్నైని ఎన్నో సార్లు కాపాడిన రైనా, ముంబైకి డెత్ బౌలింగ్ లో అండగా నిలిచే మలింగా లేకపోవడం టీమ్స్ కి కష్టమైన విషయమే అయినా వాళ్లు లేకున్నా టీంని గెలిపించే ఆటగాళ్లు రెండు జట్లలోను ఉన్నారు. మరి ముంబై చెన్నైపైన తమకున్న సక్సస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తారా లేక 2019 ఫైనల్ ఓటమికి చెన్నై రివేంజ్ తీసుకుంటుందా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.