7:29కి రిటైర్మెంట్… 7:30కి రీఎంట్రీ

మహేంద్ర సింగ్ ధోని… ఇండియాకి ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన నాయకుడు. మ్యాచ్ ఓడిపోతున్నా, లాస్ట్ ఓవర్ లో 20 రన్నులు కొట్టాలన్నా, క్లోజ్ కాల్ లో స్టంప్పింగ్స్ చేయాలన్నా అది ధోని ఒక్కడి వల్లే సాధ్యం. గ్రీజ్ దాటి అడుగు ముందుకి వేయాలంటే ఒక బాట్స్మన్ ని భయపెట్టినా, డెత్ ఓవర్లులో బౌలింగ్ చేయడానికి బౌలర్లని భయపెట్టినా… అది ధోనికి మాత్రమే చెల్లింది. కొన్ని ఏళ్లుగా ధోని ఒక్కడు చాలు మ్యాచ్ గెలివొచ్చు అనే నమ్మకం కలిగించిన ఈ ఝార్ఖండ్ డైనమేట్ ఆగష్టు 15 సాయంత్రం రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఎంతో ఇంపోరాటంట్ డెసిషన్స్ ని కూడా కూల్ గా తీసుకునే ధోని, తన క్రికెట్ కెరీర్ కి కూడా అంతే కూల్ గా గుడ్ బై చెప్పాడు. కనీసం చివరి మ్యాచ్ కూడా ఆడకుండా ఎవరూ ఊహించని టైములో రిటైర్మెంట్ ప్రకటించిన ధోని, ఐపీఎల్ 2020తో మళ్లీ గ్రౌండ్ లోకి దిగనున్నాడు. బ్లూ, వైట్ జెర్సీలో నెంబర్ 7 కనిపించకపోయినా ఎల్లో జెర్సీలో 7 కనిపించనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే, ఆగష్టు 15న సాయంత్రం 7:29 నిమిషాలకి ఇంటర్నేషనల్ క్రికెట్ కి దూరమైన ధోని సరిగ్గా నెలా నాలుగు రోజుల తర్వాత 7:30నిమిషాలకి సీఎస్కె కెప్టెన్ గా గ్రౌండ్ లో అడుగుపెట్టనున్నాడు. ఈరోజు చెన్నై ముంబై మ్యాచ్ తో ఐపీఎల్ స్టార్ట్ అవనుంది, రిటైర్మెంట్ తర్వాత ధోని ఆడనున్న మొదటి మ్యాచ్ ఇదే కావడంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ధోనినే కనిపిస్తున్నాడు. నెట్ అంతా బ్లీడ్ ఎల్లో అంటోంది.