మెగా మేనల్లుడు అనిపించుకున్నాడు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెగా ఫ్యామిలీ నుంచి సొంతగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరో. చిత్రలహరితో కంబ్యాక్ హిట్ ఇచ్చిన తేజ్, ఇప్పుడు సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు. 33 ఏళ్ల సాయి ధరమ్ తేజ్, గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా(15-10-2019) ఒక వీడియో పోస్ట్ చేస్తూ, విజయవాడలోని ఒక ఆశ్రమం వాళ్లు తనని సంప్రదించారని అసంపూర్తి స్థితిలో ఉన్న ఆ వృద్దాశ్రమ బిల్డింగ్ ని తాను కంప్లీట్ చేస్తానని చెప్పాడు.

తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న తేజ్, సంవత్సరం తిరిగే సరిగి దాన్ని పూర్తి చేశాడు. కేవలం బిల్డింగ్ మాత్రమే కాకుండా సంవత్సరం పాటు అక్కడ ఉండే వారి ఖర్చులని కూడా తానే భరిస్తానని మాటిచ్చాడు. ఆరు నెలలుగా కరోనా కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయినా, తేజ్ ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటూ వృద్ధాశ్రమాన్ని పూర్తి చేయడం గొప్ప విషయమే. మెగా ఫ్యాన్స్ కూడా చేతనైనంత సహాయం చేయాలని తేజ్ విజ్ఞప్తి చేయడంతో, సాయితేజ్ పిలుపు మేరకు మెగా ఫ్యాన్స్ రూ.లక్ష సహాయం చేశారు.