నితిన్ అంధాదున్ రీమేక్ లో తమన్నా నభ

భీష్మ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్ మంచి జోష్ లో ఉన్నాడు. హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ నితిన్ అనౌన్స్ చేసిన కొత్త సినిమా అంధాదున్. ఆయుష్మాన్ ఖురానా టబు రాధికా ఆప్టే కలిసి నటించిన ఈ మూవీ ప్రేక్షకులని మాత్రమే కాకుండా క్రిటిక్స్ ని కూడా మెప్పించింది. న్యూ ఏజ్ సినిమాగా పేరు తెచ్చుకున్న అంధాదున్ సినిమా రైట్స్ ని నితిన్ కొని చాలా రోజులే అయ్యింది కానీ ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇప్పుడు చిత్ర యూనిట్ మ్యాసివ్ అనౌన్స్మెంట్ తో నితిన్ అభిమానులని ఖుషి చేసింది.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ రీమేక్ లో టబు పాత్రలో తమన్నా, రాధికా ఆప్టే పాత్రలో నభ నటేష్ ని ఫైనల్ చేసినట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా సినిమా గురించి మరిన్ని వివరాలు కూడా చెప్తూ, మ్యూజిక్ స్వరభాస్కర్, హరి వేదాంత్ కెమెరా వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. సినిమాకి సంబంధించిన ఇతర కాస్ట్ అండ్ క్రూ డిటైల్స్ త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.