ఇలా చేస్తూనే ఉంటే దేవుడు అయిపోతావ్ సోను

దేశంలో కరోనా కారణంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా అందరికీ గుర్తొస్తున్న ఒకే ఒక్క పేరు సోను సూద్. ఇప్పటికే ఎన్నో సేవలు చేస్తున్న ఈ సూపర్ హీరో, ఇప్పుడు ఏకంగా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే ఆక్సిజన్ సిలిండర్లని ఇంటికే తెచ్చి ఇచ్చే పని మొదలు పెట్టాడు. దీనికి సంబంధించి ఓ కాల్‌ సెంటర్‌ నెంబర్‌ ఇచ్చారు. 02261403615 ఈ నెంబర్‌కు మిస్‌ కాల్‌ ఇస్తే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ మీ ఇంటి ముందు ఉంటుందని సోనూ సూద్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. పైగా ఇది పూర్తిగా ఉచితం అని ఆయన పేర్కొనడంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ”ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

చాలా మంది సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే మీ ఇంటికే ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మేమిచ్చిన నంబర్‌కి ఫోన్‌ చేసి వివరాలు తెలియజేస్తే మా సిబ్బంది ఆక్సిజన్‌ కాన్‌సెంట్రేటర్‌ మీ ఇంటికి తెస్తారు. ఈ సర్వీస్ పూర్తిగా ఉచితం. కానీ ఖాళీ కాన్‌సెంట్రేటర్‌ను తిరిగి పంపండి. అది మరొకరికి ఉపయోగపడుతుంది. రెండు ఫౌండేషన్‌లతో కలిసి మీ నగరం కోసం చేస్తున్న చిన్న సాయమిది” అని సోనూ సూద్ పేర్కొన్నారు.