హాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న హృతిక్‌రోషన్

ప్రముఖ బాలీవుడ్ హీరో హృతిక్‌రోషన్ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన జెర్ష్ అనే ఏజెన్సీతో ఇప్పటికే హృతిక్‌రోషన్ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి సినిమాతో హృతిక్‌ను హాలీవుడ్ సినిమాల్లోకి ప్రవేశపెట్టాలనే దానిపై ఆ సంస్థ చర్చలు జరుపుతుందట.

HURITIK ROSHAN

ప్రస్తుతం బాలీవుడ్‌లో హృతిక్‌రోషన్ క్రిష్4 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తైన తర్వాత హాలీవుడ్ సినిమాల్లోకి హృతిక్‌రోషన్ అడుగుపెడతాని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్‌లో ఓ స్పై థ్రిల్లర్ సినిమాలో హృతిక్ నటించనున్నాడట.

క్రిష్, సూపర్ 30, వార్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలతో బాలీవుడ్‌లో టాప్ హీరోగా హృతిక్‌రోషన్ పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు అవకాశం దక్కడంతో హాలీవుడ్‌లోనూ తన సత్తా చాటాలని హృతిక్ చూస్తున్నాడు. మరి హాలీవుడ్‌లో హృతిక్ నిలదొక్కుకుంటాడా? లేదా? అనేది చూడాలి.