పెళ్లిపై నోరు విప్పిన అనుష్క

స్వీటీ అనుష్క పెళ్లి గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడూ మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. ఆమె పెళ్లి గురించి వార్తలు రావడం, వాటిని స్వీటీ కొట్టిపారేయడం లాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ప్రముఖ వ్యాపరవేత్తతో ఆమె ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే వాటిని అనుష్క కొట్టిపారేసింది.

ఇక ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తోందని, వీరు పెళ్లి చేసుకుంటారనే వార్తల గురించి మనకి తెలిసిందే. అయితే ప్రభాస్ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని స్వీటీ ఎప్పుడో క్లారిటీ ఇచ్చింది. అటు ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పాడు.

తాజాగా పెళ్లి గురించి అనుష్క చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తనకు వివాహ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, వీలైనంత త్వరగా పిల్లలను కూడా కనాలని ఉందని ఆమె వ్యాఖ్యానించింది. ఇప్పుడే అత్యవసరంగా తాను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని, మంచి వ్యక్తి దొరికే వరకు వేచి చూస్తానంది. మంచి వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటానంది.