కమల్’ కొత్త సినిమా టీజర్ నేడే

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను నేడు కమల్ హాసన్ జన్మదినం సందర్భంగా సినిమా యూనిట్ విడుదల చేయనుంది. నేడు సాయంత్రం 5 గంటలకు టైటిల్ టీజర్ విడుదల కానుండటంతో దీని కోసం కమల్ హాసన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కమల్ హాసన్ నటిస్తున్న 232వ సినిమా ఇది. యువ డైరెక్టర్ అయిన కనగరాజ్‌తో సినిమా చేయనున్నట్లు ఈ సెప్టెంబర్‌లో కమల్ హాసన్ ప్రకటించాడు. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా.. రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమాకు ‘ఎవనేంద్రు నినైత’ అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. దీపావళి తర్వాత ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు రిలీజ్ అవుతున్న టైటిల్ టీజర్ ఈ సినిమాపై అంచనాలను ఎంతవరకు పెంచుతుందో చూడాలి.