సైజు ఎంత అని అడిగినందుకు, నీ దాని కన్నా ఎక్కువే అనేసింది

సోషల్ మీడియాలో ఆకతాయిలు ఎక్కువ, సెలబ్రిటీస్ ని ముఖ్యంగా హీరోయిన్స్ ని ట్రోల్ చేయడంలో వీళ్లు ముందుంటారు. ఒకప్పుడు ఫోటో పెడితే కింద కామెంట్స్ రూపంలో చూపించే వీరి పైశాచికత్వాన్ని ఈ మధ్య క్వేషన్ అవర్స్ లో కూడా చూపిస్తున్నారు. ఒక హీరోయిన్ ఆన్లైన్ లోకి వచ్చి ఆస్క్ మీ ఎనీథింగ్ అంటే చాలు ఎక్కడి లేని కోరికలు, అర్ధం లేని ఆలోచనలు చేసి అడగకూడనివి అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు ఇలాంటి వాటిని చూసీ చూడనట్లు వదిలేసే హీరోయిన్స్, ఈమధ్య స్ట్రాంగ్ కౌంటర్లే వేస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నోటా సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన హాట్ బ్యూటీ యాషికా ఆనంద్. మోడల్ టర్న్డ్ యాక్ట్రెస్ అయిన యషిక, సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న యషిక రీసెంట్ గా ఫ్యాన్స్ కోసం ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ పెట్టింది. ఇందులో ఫ్యాన్స్ అడిగిన అన్నింటికీ చాలా బాగా సమాధానం చెప్పిన యషిక ఆనంద్, ఇద్దరికి మాత్రం దిమ్మ తిరిగే ఆన్సర్స్ ఇచ్చింది. అందులో ఒకరు నీ బాడీ కొలతలు ఏంటి అని అడగ్గా… ఏ బట్టలు కుట్టిస్తున్నావా? వద్దు థాంక్యూ అని యషిక ఎటకారంగా సమాధానం ఇచ్చింది. ఇంకొకడు ఏకంగా నీ ఎద సైజు ఎంత అని అడిగాడు, చిరాకొచ్చిన యషిక నీ బాల్స్ సైజు కన్నా ఎక్కువే అంటూ బి-ఫిట్టింగ్ రిప్లై ఇచ్చింది. హీరోయిన్నే కాదు ఒక మాములు అమ్మాయిని కూడా అడగకూడని ప్రశ్నలు ఆన్లైన్ లో అడుగుతున్న వీరికి బుద్ది ఎప్పుడు వస్తదో తెలియదు కానీ ఇలా అడిగే ఆకతాయిలకి సాలిడ్ రిప్లైలు ఇచ్చే ధైర్యం మాత్రం హీరోయిన్లకి వచ్చింది. ఈసారి ఏమైనా అడిగే ముందు జాగ్రత్త… ఏ సమాధానం వినాల్సి వస్తుందో తెలియదు.