దళపతితో ఓకే… మరి మహేశ్ తో ఉన్నట్లా లేనట్లా?

2014లో వచ్చిన తుపాకీ నుంచి మొన్న వచ్చిన మాస్టర్ వరకూ దాదాపు 7 ఏళ్లుగా ఫ్లాప్ అనే పేరు కూడా వినపడకుండా సినిమాలు చేస్తున్న హీరో ఇళయదళపతి విజయ్. హిట్, సూపర్ హిట్, ఇండస్ట్రీ హిట్ ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఇస్తున్న విజయ్ తమిళ్ లో ఇప్పుడు ఇళయదళపతి కాదు దళపతే. ఆ స్థాయికి ఎదిగాడు అతను, యావరేజ్ టాక్ తో కూడా కోట్లు కురిపించడం విజయ్ కి అలవాటు అయిపొయింది. రజినీకాంత్ ని విజయ్ ఎప్పుడో దాటేశాడు, విజయ్ మరో రజినీకాంత్ అంటూ కాంప్లిమెంట్స్ కూడా అందుకుంటున్నాడు. కోలీవుడ్ లోనే కాదు తుపాకీ, అదిరింది, మాస్టర్ సినిమాలు టాలీవుడ్ లో భారీ వసూళ్లే సాధించాయి. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో సినిమా చేస్తున్న విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేశారు.

కొన్ని రోజులు ఇలాంటి ఒక న్యూస్ అఫీషియల్ గా బయటకి రాబోతుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో విజయ్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోతున్న ఈ ప్రాజెక్ట్ ని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. కరోనా ఉంది కాబట్టి అనౌన్స్మెంట్ రాలేదు, అన్నీ చక్కబడితే అఫీషియల్ చెప్పేస్తాం అంటూ వంశీ స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఇదిలా ఉంటే మహర్షితో మహేశ్ బాబుతో కలిసి మంచి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి మరోసారి మహేష్ తో సినిమా చేయాల్సి ఉంది. దాదాపుగా ఫైనల్ అయిన ఈ ప్రాజెక్ట్ విజయ్ తర్వాత ఉంటుందా లేక విజయ్ కన్నా ముందే ఉంటుందా అనే క్లారిటీ వంశీనే ఇవ్వాలి. మహేశ్ బాబు లైనప్ చూస్తే ఇప్పట్లో వంశీ పైడిపల్లి సినిమా ఉండేలా కనిపించట్లేదు.